బాల‌య్య‌కి తీరిక లేదా..!

Thu,December 7, 2017 10:59 AM
bala krishna next with sv krishna reddy

ఒక‌వైపు రాజ‌కీయాల‌తో మ‌రోవైపు సినిమాల‌తో బాల‌య్య బిజీ బిజీ అయ్యాడా.. అంటే అవున‌నే అనిపిస్తుంది. రాజ‌కీయాల‌లో యాక్టివ్‌గా ఉంటూనే త‌న సినిమాల‌ని ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి ప‌ట్టాలెక్కిస్తున్నాడు ఈ నంద‌మూరి న‌ట‌సింహం. త‌న వందో చిత్రంగా గౌత‌మి పుత్ర శాత‌కర్ణి అనే చిత్రం చేసిన బాల‌య్య ఆ మూవీ త‌ర్వాత 102వ చిత్రంగా కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జై సింహా అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ రానుంది. దీని త‌ర్వాత సీనియ‌ర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 103వ సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. కృష్ణా రెడ్డి రీసెంట్‌గా బాల‌య్య‌ని క‌లిసి క‌థ వినిపించ‌గా, ఆ క‌థ‌కి ఇంప్రెస్ అయిన బాల‌య్య అప్ప‌టి ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. జ‌న‌వ‌రిలో ఈ సినిమా స్టార్ట్ కానుంద‌ని టాక్‌. ఇక ఇవే కాక తేజ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తాన‌ని అన్నాడు. తేజ ప్ర‌స్తుతం వెంకీ సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ మూవీ పూర్తి కాగానే ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత బాలయ్య ల‌క్కీ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో క‌లిసి ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కుర్రాళ్ళ‌కి ధీటుగా బాల‌య్య‌ ఇలా వ‌రుస ప్రాజెక్టుల‌తో అల‌రించడం గొప్ప విశేష‌మే మ‌రి.

1166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS