గ్రాండ్‌గా లాంచ్ అయిన బాలయ్య 106వ చిత్రం

Fri,December 6, 2019 02:03 PM

నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడ్ పెంచాడు. ఆయ‌న‌ ప్ర‌ధాన పాత్ర‌లో కేఎస్ ర‌వికుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం రూల‌ర్‌. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడ‌ద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. ఇక బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలోను బాల‌య్య ఓ సినిమా చేస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ప‌లువురు ప్రముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో రోజా లేదా సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా న‌టిస్తార‌ని తెలుస్తుంది. చిత్ర లాంచింగ్ స‌మయంలో బీ గోపాల్ ఫ‌స్ట్ క్లాప్ కొట్ట‌గా, అంబికా కృష్ణ స్విచ్చాన్ చేశారు. నువ్వొక మాటంటే అది శబ్దం ... అదే మాట నేనంటే అది శాసనం అనే డైలాగ్ బాల‌య్య చెప్పి అక్క‌డి వారంద‌రిని ఆనందింపజేశారు.


998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles