కృష్ణ‌కి షాక్ ఇచ్చిన బాల‌య్య‌

Fri,December 21, 2018 09:12 AM
bala krishna meets super star krishna

నంద‌మూరి బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ రోజు సాయంత్రం ఆడియో వేడుక‌తో పాటు ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం జ‌రుపుకోనుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ కూతుళ్ల‌తో పాటు కృష్ణ‌, కృష్ఱం రాజు, మోహ‌న్ బాబు, న‌టీమ‌ణులు గీతాంజ‌లీ, జ‌మున త‌దిత‌రులు హాజ‌రు కానున్నార‌ట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ని కూడా బాల‌య్య ఆహ్వానించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఆడియో లాంచింగ్ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించేందుకు కృష్ణ‌ ఇంటికి వెళ్ళిన బాల‌య్య కొద్ది సేపు సూప‌ర్ స్టార్‌, ఆయ‌న త‌న‌యుడు న‌రేష్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించి ఆ త‌ర్వాత త‌న పాత్ర‌కి సంబంధించిన ఫోటోల‌ని మొబైల్‌లో చూపించార‌ట‌. బాలయ్య గెట‌ప్ చూసి కృష్ణ ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ సినిమా తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే మైల్ స్టోన్ అవుతుంద‌ని సీనియ‌ర్ న‌రేష్ త‌న ట్వీట్‌లో తెలిపారు. చిత్రంలో ఎంద‌రో తార‌లు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నుండ‌గా, సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కీర‌వాణి సమ‌కూర్చిన స్వ‌రాలు కూడా నేడు విడుద‌ల చేయ‌నున్నారు.

5946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles