పెండ్లి విషయంపై ప్రభాస్ కామెంట్

Mon,June 18, 2018 10:41 PM
Bahubali star prabhas tells about his marriage

బాహుబలి స్టార్ ప్రభాస్‌ పెండ్లిపై చాలా వార్తలు ఇప్పటికే ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టాయి. ప్రభాస్ ను తొందరగా ఓ ఇంటి వాడిని చేయాలనుకుంటున్నామని..సరిజోడి అయిన వధువు కోసం చూస్తున్నట్లు ప్రభాస్ పెదనాన్న, సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కూడా ఇప్పటికే ప్రకటించాడు. అయితే తాజాగా పెండ్లి విషయంపై స్పందించాడు ప్రభాస్‌.

ఇటీవలే ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..ఈ విషయమై ప్రభాస్ మాట్లాడుతూ..‘అది తన వ్యక్తిగత విషయమని... పెండ్లి గురించి చెప్పడం తనకు ఇష్టంలేదని, చెప్పాలి అనుకోవడం లేదని అన్నాడు. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీడియాకు చెబుతాను అని చెప్పాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సాహో చిత్రంలో నటిస్తున్నాడు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

4645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles