క‌డుపుబ్బ న‌వ్విస్తున్న కామెడీ మూవీ ట్రైల‌ర్

Tue,September 11, 2018 01:44 PM
badhai ho movie trailer released

ఆయుష్మాన్ ఖురానా, సన్యా మల్హోత్రా, గజరాజ్ రావ్, నీనా గుప్త ప్రధాన పాత్రలలో అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం బ‌దాయి హో. కామెడీ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వినీత్ జైన్, అలేయ సేన్, హేమంత్ బండారి, అమిత్ రవీంద్రనాథ్ శర్మ సంయుక్త నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి భారీ ప్ర‌మోష‌న్స్ జ‌రుపుతున్నారు మేక‌ర్స్‌. ఇటీవ‌ల విడుద‌లైన ఫోటోలు, టీజ‌ర్స్ తో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ పెర‌గ‌గా, తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై అమితాస‌క్తిని క‌లిగించింది. మన‌వ‌ళ్ళ‌ని ఎత్తుకోవ‌ల‌సిన వ్యక్తి తండ్రి అయితే, ఆ స‌మ‌యంలో ఆయ‌న పిల్ల‌ల పరిస్థితి ఎలా ఉంటుంద‌నే నేప‌థ్యంలో సినిమాని తెర‌కెక్కించిన‌ట్టు ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఫ‌న్నీగా ఉండ‌గా, ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతున్నారు. మ‌రి తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.

4798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles