సాహో నుంచి ‘బ్యాడ్ బాయ్’ వీడియో సాంగ్

Mon,August 19, 2019 05:41 PM
Badboy song released from saaho movie

ప్రభాస్, శ్రద్దాకపూర్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ‘బ్యాడ్ బాయ్’ వీడియో సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రభాస్, జాక్వెలిన్ ల మధ్య వచ్చే ఈ పాట అందమైన లొకేషన్లలో రొమాంటిక్ గా సాగుతుంది. ఈ పాటను శ్రీజో రాయగా.. బాద్ షా, నీతి మోహన్ పాడారు. ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఆగస్టు 30న సాహో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు ముస్తాబవుతోంది.

1244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles