నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య న‌డిచిన బిగ్ బాస్ ఎపిసోడ్ 11

Thu,June 21, 2018 08:52 AM
babu gogineni warns to bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 2 విజ‌యవంతంగా ప‌ది ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని బుధ‌వారం రోజు ప‌ద‌కొండో ఎపిసోడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. కంటెస్టెంట్స్‌ల మ‌ధ్య పోట్లాట‌, బిగ్ బాస్ వార్నింగ్స్‌, బాబు గోగినేని చుర‌కలు ఇలా బిగ్ బాస్ సీజ‌న్ 2లో ప‌ద‌కొండో ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించింద‌నే చెప్ప‌వ‌చ్చు. తాజా ఎపిసోడ్ లో ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం ‘ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది’ టాస్క్‌ రెండు టీంల మధ్య హోరా హోరీగా ప్రారంభమైంది. ఈ టాస్క్‌లో మొద‌ట తనీష్, సామ్రాట్‌ల మధ్య పోరు భీక‌రంగా జరిగింది. గీతామాధురి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ టాస్క్‌లో త‌నీష్ విజేతగా నిలిచాడు. మ‌ట్టిలో పోటీ ప‌డిమ‌రీ జెండాల‌ను పెట్ట‌డంతో త‌నీష్‌, సామ్రాట్‌ల‌కి చిన్న‌పాటి గాయాల‌య్యాయి. దీంతో బాబు గోగొనేని కాస్త ఫైర్ అయ్యారు .

శ‌రీరానికి గాయాలు అయ్యేటట్టు టాస్క్‌లు పెట్ట‌డం క‌రెక్ట్ కాదు. గాయాలై ర‌క్తాలు వ‌స్తుంటే మీకు త‌మాషాగా ఉందా..! లేక‌పోతే రెండు క‌త్తులు ఇవ్వండి కొట్టుకుంటారు. రారా.. బిగ్ బాస్ కిందకి నువ్. నీ సంగతి చూస్తా అంటూ బిగ్ బాస్‌కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాబు గోగినేని. దీనికి స్పందించిన బిగ్ బాస్ .. ఎటువంటి టాస్క్ అయిన గాయాలు కామ‌న్ గానే ఉంటాయి. టాస్క్ న‌చ్చ‌క‌పోతే బ‌య‌ట‌కి వెళ్ళిపోవ‌చ్చు, దీనివ‌ల‌న ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ కోల్పేయే ప్రభావం ఉంటుంద‌ని బిగ్ బాస్ తెల‌ప‌డంతో కాస్త అసంతృప్తితోనే శ్యామ‌ల‌తో క‌లిసి మట్టిలో ఉన్న మాణిక్యాలను వెతికారు బాబు గోగినేని. ఎక్కువ రత్నాలను వెతికిపట్టిన బాబు గోగినేనిని విజేతగా ప్రకటించారు.



ఇక హౌజ్ కెప్టెన్‌గా ఉన్న సామ్రాట్‌పై బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. ఇంటి స‌భ్యులంద‌రు నియ‌మాలు పాటించేలా చూడాల్సిన కెప్టెన్‌, నియ‌మాలు ఉల్లంఘించ‌డం స‌రికాదు అని సామ్రాట్‌కి కాస్త చుర‌క‌లంటించారు బిగ్ బాస్‌. ప‌గ‌టిపూట నిద్ర‌పోయే వారికి చిన్న‌పాటి వార్నింగ్ కూడా ఇచ్చారు. కొంద‌రు మైక్‌ల‌ని స‌రిగా ధ‌రించ‌కపోగా, వాటిని దాచేస్తూ ఇంటినియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్నారు. ఇంగ్లీష్‌లో ప‌దే ప‌దే మాట్లాడుతున్నారు. హౌజ్ మేట్స్ నామినేష‌న్ ప్ర‌క్రియ గురించి ఎక్కువగా చ‌ర్చిస్తున్నారు.ఇంటి స‌భ్యులు నియ‌మాల‌ని ఉల్లంఘించ‌కుండా చూడాల్సిన బాధ్య‌త మీపై ఉంది. టాస్క్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చి చాలా సేపు అయిన మీరు ఇంకా బ‌య‌టికి రాలేదు. మీరు కెప్టెన్‌గా విఫలం అయ్యారంటూ సామ్రాట్‌ని హెచ్చరించారు బిగ్ బాస్.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు ఇంటి సభ్యులు. ఈ టాస్క్‌లో రెండు టీంలు ఉన్నాయి ఒకటి మహారాజ టీం కాగా.. రెండోది రాజకుమారి టీం. ఈ టాస్క్‌లో ఎవరు ఓడిపోతే వాళ్లు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని బిగ్ బాస్ హెచ్చరించారు . ఇక ఈ టాస్క్‌లో భాగంగా.. డైమండ్ టాస్క్‌, రాజమాల టాస్క్‌, సింహాసనం టాస్క్‌లను ఇచ్చారు బిగ్ బాస్. ఓవరాల్‌గా ఈ మూడు టాస్క్‌లలో రాజకుమారి టీం విజేతగా నిలవడంతో మ‌హారాజు టీంలో ఉన్న‌ యాంకర్ -దీప్తి, నూతన్ నాయుడులు జైలుకు వెళ్ళారు. ల‌గ్జరీ బడ్జెట్‌లో జరిగిన టాస్క్‌లు అన్నీ సింగర్ గీతా మధురి ఆధ్వర్యంలో జరిగాయి.




సింహాసనం టాస్క్‌లో ఒక గ్రూప్‌కి ఫేవర్‌గా మాట్లాడుతుందంటూ హీరో తనీష్... గీతా మాధురిపై అసహనం వ్యక్తం చేయడంతో ఫుల్ ఫైర్ అయింది గీతా మాధురి. ఇది నా ఇష్టం, ఇక్కడ ఎవడూ తోపు కాదు. ఏమైనా ఉంటే బిగ్ బాస్‌తో మాట్లాడుకో.. అలా చేయలేదు ఇలా చేయలేదు అనడానికి నువ్ ఎవరు? అంటూ తనీష్‌పై బ్లాస్ట్ అయ్యింది గీతా మాధురి. ఏదైనా గేమ్ పెట్టేటప్పుడు బలా బలాలు సరిచూసి టీమ్‌ని సెలక్ట్ చేయాలని.. తాము సింహాసనం టాస్క్‌లో ఓడిపోవడానికి మా టీంలో ముగ్గురే అబ్బాయిలు ఉండటం.. ఆపోజిట్ టీంలో ఐదుగురు అబ్బాయిలు ఉండటంతో వాళ్లు గెలిచారని.. తనీష్, కౌశిక్ వాదించారు. అయితే తొలిరోజే సంజ‌నాతో క‌లిసి బిగ్ బాస్ హౌజ్‌లో జైలు జీవితం గడిపిన నూత‌న్ నాయుడు మ‌రోసారి దీప్తితో క‌లిసి జైలుకి వెళ్ళారు. అయితే వీళ్ళ‌ని జైలు నుండి రిలీజ్ చేసేందుకు తాళాన్ని దొంగిలించే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్‌. టాస్క్‌లో గెలిచిన వారు నూత‌న్ నాయుడు, దీప్తిల‌ని విడిపించే ఛాన్స్ ఉంటుంది. మ‌రి టాస్క్‌లో ఎవ‌రు గెలిచి ఆ ఇద్ద‌రిని జైలు నుండి విడిపిస్తారో తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగ‌క త‌ప్ప‌దు.

3059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles