మే కి ఫిక్స్ అయిన మస్తీ మహారాజా

Thu,April 6, 2017 10:24 AM
Babu Baga Busy release date fixed

బాలీవుడ్ మూవీ హంటర్ కి రీమేక్ గా తెలుగులో బాబు బాగా బిజీ అనే ప్రాజెక్ట్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ కామెడీ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ పోషించగా తేజస్వి మదివాడ, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి,సుప్రియ కీలక పాత్రలు పోషించారు. అవసరాల.. మస్తీ మహరాజా పాత్రలో కనిపించనుండగా ఈయన పాత్రని చూసి టాలీవుడ్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. సెక్స్ కి అడిక్ట్ అయిన వ్యక్తిగా తొలిసారి విభిన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన బాబు బాగా బిజీ అనే చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంలో టీం ఉంది. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆ మధ్య యూనిట్ ప్రకటించింది. కాని తాజాగా అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 5న మూవీని విడుదల చేస్తున్నామంటూ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమా రిలీజ్ కి వారం ముందు బాహుబలి లాంటి క్రేజీ చిత్రం విడుదలవుతున్నా, ఆ సినిమాకి పోటీగా బాబు బాగా బిజీ చిత్రాన్ని విడుదల చేయడం విశేషం. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన పాటలు సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్నాయి.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles