బాబు బాగా బిజీ టైటిల్ సాంగ్ విడుదల

Wed,March 22, 2017 11:06 AM
Babu Baga Busy  Movie Title Song

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా వరుస విజయాలు అందుకుంటున్న అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ కామెడీ చిత్రంలో అవసరాల లీడ్ రోల్ పోషించగా ఆయన సరసన తేజస్వి మదివాడ, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి,సుప్రియ లు హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళీ లు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే హంటర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘బాబు బాగా బిజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది టీం. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో రెజీనా కసాండ్రా కూడా తళుక్కున మెరవనుందని చెబుతున్నారు. తాజాగా చిత్ర టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ సినీ లవర్స్ ని ఎంతగానో అలరిస్తుంది. ఆ సాంగ్ ని మీరు విని ఎంజాయ్ చేయండి.

1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles