బాహుబలి- ద లాస్ట్ లెజెండ్స్ టీజర్ విడుదల

Sat,October 1, 2016 12:01 PM
Baahubali: The Lost Legends teser released

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న కొన్నాళ్ళుగా ప్రపంచం మొత్తాన్ని ఊరిస్తూ వస్తోంది. అయితే ఈ క్యూరియాసిటీకి ఎండ్ చెప్పే టైం దగ్గరగానే ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాగ్నమ్ ఓపస్ సంస్ధ బాహుబలి- ద లాస్ట్ లెజెండ్స్ అనే టైటిల్‌తో ఓ యానిమేటేడ్ సిరీస్‌ని లాంచ్ చేస్తుండగా, దీనికి ఎస్‌.ఎస్ రాజమౌళితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సహకారం అందిస్తున్నారు. ఈ సిరీస్‌లో హిడెన్ స్టోరీస్, యుద్దాలు, యాక్షన్, పొలిటికల్, ద్రోహం, రాజకీయ కుట్ర తదితర అంశాలను చూపించనున్నారు. ఇదేకాక కట్టప్ప, బాహుబలి, శివగామి, దేవసేన తదితర క్యారెక్టర్స్‌ని కూడా ఈ సిరీస్‌లో చూపించనున్నారు. తాజాగా బాహుబలి- ద లాస్ట్ ఆఫ్ లెజెండ్ టీజర్‌ని విడుదల చేశారు. ఆ టీజర్‌ని రాజమౌళి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా షేర్ చేశాడు. మరి మీరు ఆ టీజర్ పై ఓ లుక్కేయండి.

2858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles