ఒకే ఫ్రేములో రాజ‌మౌళి, రానా, ప్ర‌భాస్

Sun,December 9, 2018 07:06 AM
baahubali team in karan show

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. రెండు పార్ట్‌లుగా విడుద‌లైన ఈ చిత్రం ఎన్నో రికార్డుల‌ని చెరిపేసి, ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో నిలిచింది. బాహుబ‌లి 2 రికార్డ్ చెరిపేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికి ,అది సాధ్యం కావ‌డం లేదు. తెలుగు వాడి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన బాహుబ‌లి విదేశాల‌లోను అల‌రించింది. అయితే ఈ చిత్రం రూపొంద‌డానికి కార‌కుడైన రాజ‌మౌళి, బాహుబ‌లి పాత్ర‌లో మెరిసిన ప్ర‌భాస్‌, భ‌ళ్ళాల‌దేవుడిగా ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించిన రానా మరోసారి ఒకే ఫ్రేములో కనిపించి సంద‌డి చేస్తున్నారు.

బాహుబ‌లి సినిమా వ‌ల‌న దాదాపు రెండు మూడు ఏళ్ళు క‌లిసి ప్ర‌యాణించిన రాజ‌మౌళి, ప్ర‌భాస్, రానాలు ప్ర‌స్తుతం ఎవ‌రి ప్రాజెక్టుల‌తో వారు బిజీ అయ్యారు. అయితే తాజాగా వీరి ముగ్గురిని ఒకే వేదిక‌పై క‌లిపే ప్ర‌య‌త్నం చేసారు క‌ర‌ణ్ జోహార్‌. కాఫీ విత్ క‌ర‌ణ్ షో అనే కార్య‌క్ర‌మానికి వీరి ముగ్గురిని ఆహ్వానించిన ఈ ద‌ర్శ‌క నిర్మాత చురుకైన ప్రశ్నలు సంధిస్తూ, గాసిప్స్‌పై వివరణ కోరిన‌ట్టు తెలుస్తుంది. ఈ షో త్వ‌ర‌లో ప్రసారం కానుండ‌గా, బాహుబ‌లి టీం కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫోటోల‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం 6వ సీజన్ నడుస్తోంది. బాహుబ‌లి చిత్రాన్ని తన ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో హిందీ ప్రేక్షకులకు చేర‌వేసిన ఘ‌న‌త క‌ర‌ణ్ జోహార్‌దే అని చెప్ప‌వ‌చ్చు.1863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles