గెస్ట్‌హౌస్‌ సీజ్: హైకోర్టుకి సినీ హీరో ప్రభాస్

Wed,December 19, 2018 12:57 PM
baahubali star approaches to high court

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పైగాలోని వివాదాస్పద స్థలంలోని అర ఎకరంలో సినీ హీరో ప్రభాస్ నిర్మించుకున్న గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే . సర్వే నంబర్ 46 లోగల రూ. 1700 కోట్ల విలువ చేసే 84.30 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారని ప్ర‌భాస్ అన్నారు . ఈ మేరకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటీష‌న్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

ప్ర‌భాస్ గెస్ట్ హౌజ్‌.. రాయదుర్గం సమీపంలో ‘పైగా’ గ్రామానికి చెందిన లింగమయ్య, మాల రాములుతో కలిపి 24 మందిద‌ని అంటూ ఇరువై ఏండ్లుగా వారు కోర్టులో పోరాడుతున్నారు. సదరు భూమిలో తమ పూర్వీకులు 1950ల్లోనే పంటలు అలికారని అప్పటి నుంచి తమ కబ్జాలోనే ఉందని పేర్కొంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ స్థలంలో 9 బర్రెల కొట్టాలు, 3 రూములు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో లింగమయ్య తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సర్వే నంబర్ 46 లోని భూములు లింగమయ్య అండ్ అదర్స్ పేరిట పట్టా చేయాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రెవెన్యూ అధికారులు హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించారు.

డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును కొట్టివేయటంతో పాటు 84.30 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందుతుందని తీర్పు వెలువరించింది. దీంతో లింగమయ్య అండ్ అదర్స్ సెప్టెంబర్ చివరి వారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. అది ప్రభుత్వ భూమేనని, ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులూ లేవని తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పును అనుసరించి సోమవారం సదరు స్థలాన్ని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

మోసపోయిన హీరో
లక్ష్మి అనే మహిళ నుంచి ప్రభాస్ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 59 జీవో ప్రకారం ప్రభాస్ రూ.1 కోటి చెల్లించి స్థల క్రమబద్ధీకరణకు అర్జీ పెట్టుకున్నారు. విచారణకు వచ్చిన రెవెన్యూ సిబ్బది ఒక సర్వే నంబర్‌లోని భూమిని మరో సర్వే నంబర్‌లో క్రమబద్ధీకరించటం కుదురదంటూ నిలిపివేశారు. దీని గురించి రెవెన్యూ అధికారులు వివరించడంతో ప్రభాస్ తన సిబ్బందితో బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు.

5430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles