రాజ‌మౌళి సినిమాతో మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ..!

Tue,November 20, 2018 08:40 AM
Baahubali director SS Rajamouli joins hands with Mahesh Babu

ఓట‌మెరుగని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తో ప్రచారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కి విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఏ హీరోతో మూవీ చేయ‌నున్నాడ‌నే విష‌యంపై అప్పుడే చ‌ర్చ మొద‌లైంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రానుంద‌ని ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేయాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్న‌ట్టు టాక్‌. రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలోపు మ‌హేష్ ముందుగా త‌ను సుకుమార్‌, సందీప్ రెడ్డితో కుదుర్చుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ట‌. స‌రికొత్త పాయింట్‌తో రాజ‌మౌళి- మ‌హేష్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని, ఈ సినిమా చ‌రిత్ర తిర‌గరాస్తుంద‌ని జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం మ‌హేష్‌.. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుదల కానుంది. అల్ల‌రి న‌రేష్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

2991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles