పైర‌సీలోను బాహుబ‌లి 2 టాప్ ..!

Fri,March 23, 2018 11:11 AM
baahubali 2 gets top position in piracy

ఈ ఇండస్ట్రీ ఆ ఇండ‌స్ట్రీ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాలని పైరసీ భూతం పట్టి పీడిస్తుంది. దర్శక నిర్మాతలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, పైరసీదారులని అరికట్టలేకపోతున్నారు. చిన్న సినిమాలకే కాదు భారీ బడ్జెట్ చిత్రాలని కూడా ఈ రాకాసీ భూతం పట్టి పీడిస్తుండడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. అన్ని కోట్ల ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే, పైరసీ వలన పెట్టిన రాబడి తిరిగి రావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైర‌సీలోను బాహుబ‌లి 2 టాప్‌


ఇండస్ట్రీకి సవాల్ గా మారినవి రెండే రెండు . ఒకటి లీకేజ్ బెడద అయితే మరొకటి పైరసీ. ఈ పైరసీ భూతం సంచలనాలు సృష్టించిన‌ బాహుబలి 2 సినిమాను కూడా వదలలేదు. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మరెన్నో టెక్నాలజీలు వాడిన పైరసీ భూతం నుండి ఈ విజువల్ వండర్ ని కాపాడలేక పోయాడు. స్మార్ట్ ఫోన్స్ లో బాహుబలి 2 చిత్ర హెచ్ డి ప్రింట్ సినిమా రిలీజైన కొద్ది రోజుల‌కే చక్కర్లు కొట్టింది. దీంతో బాహుబలి 2 కలెక్షన్స్ కి భారీగానే గండిపడిన‌ట్టు తెలిసింది. అయితే 2017లో విడుద‌లైన మ‌రో రెండు చిత్రాలు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్, అర్జున్ రెడ్డి చిత్రాలు కూడా ఎక్కువ‌గా పైర‌సీ అయ్యాయ‌ట‌. ఒ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన స‌ర్వేలో పైర‌సీ బారిన ప‌డిన తొలి చిత్రంగా బాహుబ‌లి 2 ఉంటే రెండు డీజే, మూడు అర్జున్ రెడ్డి నిలిచాయి. ఈ విష‌యంపై డీజే డైరెక్ట‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఖ‌ర్మ అనే కామెంట్ పెట్టి ప్రైవేట్ సంస్థ స‌ర్వే ఫోటో షేర్ చేశాడు హరీష్ శంకర్.

హ‌రీష్ త‌దుప‌రి ప్రాజెక్టులు


ఇక హరీష్ శంకర్ తదుపరి సినిమా విష‌యానికి వ‌స్తే నితిన్- శర్వానంద్ కాంబినేషన్ లో దాగుడుమూతలు అనే టైటిల్ తో హరీష్ మల్టీ స్టారర్ చేయనున్నాడు అని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం కి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత జవాన్ చిత్రాన్ని నిర్మించిన కొమ్మలపాటి క్రిష్ణ నిర్మాణంలో సీటీమార్ అనే సినిమా చేయనున్నాడట హరీష్ శంకర్. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలోని సీటీమార్ సీటీమార్.. సాంగ్ లోని పల్లవినే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారు. వరుస హిట్స్ తో మంచి జోరుమీదున్న యువ కథానాయకుడు నాని ఈ మూవీలో హీరోగా నటించనున్నాడని తెలుస్తుండగా, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు.


2390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles