కొత్త మూవీ ఫస్ట్ పోస్టర్..షేర్ చేసిన స్టార్‌హీరో

Mon,June 12, 2017 09:57 PM


ముంబై: బాలీవుడ్ స్టార్ అజయ్‌దేవ్‌గన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బాద్‌షాహో. మిలాన్ లుథ్రియా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్‌హష్మీ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌ను అజయ్‌దేవ్‌గన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 1975 ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇషా గుప్తా, ఇలియానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2010లో వచ్చిన వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా తర్వాత అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్‌హష్మీ, మిలన్‌లుథ్రియా కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనుంది.

1740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles