అదిరిన ‘అజహర్’ ఫిక్సింగ్ షో - ఫిల్మ్ రివ్యూ

Sat,May 14, 2016 09:31 AM
Azhar Film review

హైదరాబాద్ : ఫ్లిక్ షాట్‌కు అతడే ఫేమస్. లెగ్ గ్లాన్స్‌కూ అతడే. క్రీజ్ ను వదిలి సిక్సర్ కొట్టాలన్నా అజహరే. టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దిన్ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన అజహర్ మూవీ క్రికెట్ ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్ర పోషించిన ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ మైదానంలో సిక్సర్ కొట్టాడు.

క్రికెటర్ అజర్ 1990 దశకంలో చాలా ఫేమస్. కానీ ఓ స్టింగ్ ఆపరేషన్ అతన్ని జీరో చేసేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అతని కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించేశాయి. వందో టెస్టు కల నెరవేరకుండానే ఆ మేటి క్రికెటర్ తన క్రికెట్ ఇన్నింగ్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల్సి వచ్చింది. టోనీ డిసౌజా డైరక్షన్ చేసిన అజహర్ ఫిల్మ్ ఈ పాయింట్‌తోనే మొదలవుతుంది.ఓ దశలో అజర్ కెరీర్ టాప్ ఫామ్‌లో కొనసాగుతోంది. ఆ దశలోనే ఓ బుకీ వీరాభిమానిలా పరిచయం అవుతాడు. అజర్ అతని ఉచ్చులో పడుతాడు. ఆ తర్వాత ఇక మ్యాచ్ ఫిక్సింగ్. టెస్టుల్లో సెంచరీతోనే అరంగేట్రాన్ని అదరగొట్టిన అజహర్ తన కెరీర్ క్లయిమాక్స్‌లో ఎలా ఫిక్సింగ్ వలలో చిక్కాడో ఫిల్మ్‌లో చాలా ఆకర్షణీయంగా ప్రజెంట్ చేశారు.

బుకీ ఆర్కే శర్మ క్రికెటర్ అజహర్ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఆట కాదు డబ్బే ముఖ్యమంటూ బుకీ చెప్పిన మాటలకు అజర్ లోంగిపోతాడు. సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అజహర్‌పై ఆరోపణలు వస్తాయి. ఆ గండం నుంచి బయటపడాలంటే దాన్ని కోర్డులోనూ ఎదుర్కోవాలని అజ్జూ నిర్ణయిస్తాడు.తన ఫ్రెండ్ లాయర్ రెడ్డికే ఫిక్సింగ్ కేసును అజర్ అప్పగిస్తాడు. లాయర్ రెడ్డి పాత్రను రాయ్ కపూర్ పోషించాడు. భయస్తుడైన ఆ లాయర్ కేసును డీల్ చేసిన తీరును డైరక్టర్ స్క్రీన్‌పై ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడు. ఇక క్రికెట్ మండలి తరపున కేసును వాదించిన లాయర్‌గా లారా దత్త నటించింది.

ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ జీవితం బెట్టింగ్‌కు ఎలా బలి అయ్యిందో అజహర్ మూవీలో నీట్ గా తెరకెక్కించారు. స్టయిలిష్ స్ట్రోక్స్‌తో క్రికెట్ లవర్స్‌కు థ్రిల్ పుట్టించిన అజర్ పాత్రను ఇమ్రాన్ హష్మీ అత్యంత ఈజీగా ప్లే చేశాడు. క్రికెట్ ఫీల్డ్‌లో అజ్జూ భాయ్ స్టయిల్స్ ప్రత్యేకమైనవి. ఆ ఫేమస్ బ్యాట్స్‌మెన్ టాలెంట్‌ను యధావిధిగా స్క్రీన్ మీద చూపించాడు హష్మీ. ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న అజహర్ ను బీసీసీఐ జీవిత కాలం పాటు నిషేధించింది.అజర్ మొదట జీవిత భాగస్వామి పాత్రను ప్రాచీ దేశాయ్ పోషించింది. మొదటి భార్య నౌరీన్ పాత్రను ప్రాచీ తన నటనా ప్రతిభతో అవలీలగా మార్చేసింది. హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్న దశలో ఆ క్రికెటర్‌కు నౌరీన్ చేసిన సహకారం మరిచిపోలేనిది. డైరక్టర్ టోనీ డిసౌజా అజర్, నౌరీన్ కలయికను కమర్షియల్ స్ట్రోక్స్‌తో ఆకట్టుకునేలా తీశాడు.

బాలీవుడ్ బ్యూటీ సంగీతా బిజిలాని కూడా ఎలా అజర్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యిందో కూడా ఫిల్మ్‌లో ఆసక్తికరంగానే ప్రజెంట్ చేశారు. సంగీతా పాత్రను నర్గీస్ ఫక్రీ పోషించింది. సంగీతా అందాలకు చిత్తు అయిన అజర్ ఆ మైఖం నుంచి బయటపడలేక తన మొదటి భార్యకు దూరం అవుతాడు. ఆ సన్నివేశాలను కూడా అద్భుతంగానే తెరకెక్కించారు.

స్టింగ్ ఆపరేషన్‌తో మొదలైన సినిమాకు డీసెంట్ స్క్రీన్‌ప్లే అందించారు. కథను సూటిగా చెప్పకుండా చాలా థ్రిల్లింగ్‌గా ఫిల్మీ స్టయిల్లో ప్రజెంట్ చేశారు. అజర్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. వంద టెస్టులు ఆడాలన్నది అజ్జూ భాయ్ తాత కోరిక. కానీ ఒక్క టెస్టు దూరంలోనే ఆ ఆశయం ఆగిపోయింది. మైదానంలో వందో టెస్టు ఆడాలన్న అజర్ తపన తీరలేదు. కానీ కోర్టు రూమ్‌లో అతను ఆడిన టెస్టే నిజమైన వందో టెస్టు.

3950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles