ఆలోచింపజేస్తున్న ‘ఆర్టికల్ 15’ ట్రైలర్

Thu,May 30, 2019 06:00 PM
Ayushmann Khurrana Article 15 trailer revealed


బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లోని మతం, కులం, జాతి, లింగబేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన ఈ ట్రైలర్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2014-బదౌన్ గ్యాంగ్ రేప్ ఘటన ఆధారంగా వాస్తవ అంశాలను చూపిస్తూ ఈ సినిమాను తీశాడు అనుభవ్ సిన్హా. రోజువారీ కూలీలుగా పనిచేసే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కేవలం మూడు 3 రూపాయలు పెంచాలని యజమానులను అడుగుతారు. అయితే ఆ తర్వాత వారిలో ఇద్దరు యువతులను కొందరు దారుణంగా సామూహిక అత్యాచారం చేసి..చెట్టుకు ఉరివేసి చంపేస్తారు. అయుష్మాన్ ఖురానా ముగ్గురు అక్కాచెల్లెళ్లలో అదృశ్యమైన మరో యువతి ఆచూకీకోసం దర్యాప్తు కొనసాగిస్తుంటాడు. అగ్రకులం, అనగారిన కులాలను ప్రస్తావిస్తూ సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇషా తల్వార్, సయానీ గుప్తా, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ లో ప్రేక్షకుల ముందుకురానుంది.

1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles