అద‌ర‌గొట్టిన ఉత్త‌మ హీరోలు..

Fri,August 9, 2019 05:25 PM
Ayushman Khurana and Vicky Kaushal wins best actor awards

హైద‌రాబాద్‌: గ‌త ఏడాది క్రియేటివ్ ఆర్ట్‌కు బాలీవుడ్ వేదిక‌గా నిలిచింది. ఎన్నో అత్యుత్త‌మ చిత్రాలు సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. 66వ జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను ఇవాళ ప్ర‌క‌టించారు. అయితే ఉత్త‌మ న‌టుడు అవార్డును ఇద్ద‌రు హీరోల‌కు సంయుక్తంగా ప్ర‌క‌టించారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ అంధాదున్‌లో న‌టించిన ఆయుష్మాన్‌ ఖురానాతో పాటు 'ఉరి: ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్‌'లో న‌టించిన విక్కీ కౌశల్‌కు ఈ అవార్డు ద‌క్కింది. నిజానికి ఈ ఇద్ద‌రూ త‌మ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టారు. ఈ రెండు సినిమాలే కాదు, గ‌త ఏడాది బాలీవుడ్‌లో ఎన్నో మేటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అక్ష‌య్ కుమార్ న‌టించిన ప్యాడ్‌మ్యాన్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. కానీ ఆ సినిమాకు కేవ‌లం ఉత్త‌మ సామాజిక చిత్రం అవార్డు ద‌క్కింది.

అయితే, ఆయుష్మాన్‌ న‌టించిన మ‌రో చిత్రం బ‌దాయి హోకు కూడా అవార్డు ద‌క్క‌డం విశేషం. బెస్ట్ ఎంట‌ర్‌టేన‌ర్ క్యాట‌గిరీలో బ‌దాయి హోకు అవార్డు ద‌క్కింది. అంధాదున్‌లో ఆయుష్మాన్ న‌ట‌న ఓ స్పెష‌ల్‌. థ్రిల్ పుట్టించే స్క్రీప్టుకు ఆయుస్మాన్ త‌న న‌ట‌న‌తో జీవం పోశాడు. పొట్ట కూటి కోసం సంగీతం వాయించే గుడ్డివాడి పాత్ర‌లో ఆయుష్మాన్‌ అద్భుతంగా న‌టించాడు. కానీ నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఫిల్మ్ స్టోరీ ఎలా మ‌లుపులు తిరుగుతుంద‌నేది ఓ థ్రిల్‌. ఆయుస్మాన్ త‌న యాక్ష‌న్‌తో సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మార్చాడు.


ఇక ఉరి: ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్‌లో విక్కీ కౌశ‌ల్ కూడా త‌న ట్యాలెంట్ ఏంటో చూపించాడు. ఉరిలో జ‌రిగిన ఉగ్ర దాడి ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా భార‌త ఆర్మీ స‌ర్జిక‌ల్ దాడి చేప‌డుతుంది. పాక్‌లోని ఉగ్ర స్థావ‌రాల‌పై ఆర్మీ దాడి చేస్తుంది. అయితే ఆ టీమ్‌కు కెప్టెన్‌గా విక్కీ కౌశ‌ల్ ఉంటాడు. ప్ర‌తి ఫ్రేమ్‌లో స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ త‌ర‌హాలోనూ సినిమా వెళ్తుంది. ఎక్క‌డ కూడా ఎమోష‌న్స్ త‌గ్గే ప్ర‌స‌క్తే ఉండ‌దు. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో ఉత్కంఠంగా తెర‌కెక్కించారు. అయితే విక్కీ కౌశ‌ల్ ఒక్కొక్క షాట్‌లోనూ త‌న న‌ట‌నా నైపుణ్యంతో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేశాడు. ఫిల్మ్‌లోని మ్యూజిక్ కూడా ఓ హైలెట్‌. హాలీవుడ్ వార్ మూవీ త‌ర‌హాలో ఉరి: ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ సినిమాను తీర్చిదిద్దారు. ఒక్క ఎలిమెంట్‌లోనూ హాలీవుడ్‌ను తీసిపోలేద‌న్న సంకేతాన్నిచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, బెస్ట్ డైర‌క్ష‌న్ ఆదిత్య ధారా, బెస్ట్ సౌండ్ డిజైన్ క్యాట‌గిరీల్లోనూ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్‌కు అవార్డులు ద‌క్కాయి.

2787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles