అయోగ్య‌.. యాక్ష‌న్ ప్యాక్డ్ ట్రైల‌ర్

Sat,April 20, 2019 08:34 AM
Ayogya Official Trailer released

పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన టెంప‌ర్ చిత్రం హిందీ, త‌మిళ భాష‌ల‌లో రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. హిందీలో ఇప్ప‌టికే విడుద‌లైన రీమేక్ చిత్రం త‌మిళంలోఅయోగ్య పేరుతో విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. మే 19న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు అచ్చం తెలుగు చిత్రంలోని స‌న్నివేశాల మాదిరిగానే ఉన్నాయి. హీరో పాత్ర‌కి సంబంధించిన సీన్ల‌తోనే ట్రైల‌ర్ క‌ట్ చేయ‌గా, దీనికి మంచిరెస్పాన్స్ వ‌స్తుంది. ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయోగ్య చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ పాట‌లో విశాల్‌తో క‌లిసి స‌న్నీ ఆడిపాడింద‌ట‌. పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. అయోగ్య థియేట్రికల్ రైట్స్ ను స్క్రీన్ సీన్ సంస్థ దక్కించుకుంది.

752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles