ఇండస్ట్రీలోకి హీరో కుమారుడు ఎంట్రీ

Fri,July 29, 2016 10:42 PM
Ayaan Hashmi makes his film debut


ముంబై: బాలీవుడ్ హీరో ఇమ్రాన్‌హష్మీ నటించిన అజహర్ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్‌టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈ స్టార్ కుమారుడు అయాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

తన కుమారుడు అయాన్ టైగర్స్ డే ను పురస్కరించుకుని తీసిన లఘుచిత్రంలో నటించాడని ఇమ్రాన్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయాన్ ఆరేళ్ల వయసులో స్క్రీన్‌పై కనిపించాడని..సరిగ్గా ఇదే వయసులో తాను కూడా మొదటిసారి కెమెరా ముందుకొచ్చానని అభిమానులతో తన జ్ఞాపకాలను పంచుకున్నాడు ఇమ్రాన్. అయాన్ నటించిన షార్ట్ ఫిలిమ్‌ను బర్న్ ప్రీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నటి దియామీర్జా నిర్మించారు.


1952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles