ఇంట‌ర్నెట్‌ని బ్రేక్ చేస్తున్న ఐష్‌, ఆరాధ్య పిక్

Thu,July 12, 2018 01:58 PM
Awwdorable Photo Of Aishwarya And Aaradhya Is Breaking The Internet

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్ ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తుందనే విష‌యం అంద‌రికి తెలిసిందే. సినిమాల‌తో ఎంతో బిజీగా ఉండే ఐష్ త‌న ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయిస్తుంది. ముఖ్యంగా కూతురితో ఆనంద‌ స‌మ‌యం గ‌డుపుతూ ఉంటుంది. ప‌లు సంద‌ర్భాల‌లో షూటింగ్‌కి కూడా త‌న‌తో పాటు తీసుకెళుతుంటుంది ఐశ్వ‌ర్య‌రాయ్‌. ప్ర‌స్తుతం అమితాబ్ బ‌చ్చ‌న్ అత‌ని కొడుకుతో క‌లిసి ర‌ష్యాలో ఉన్నారు. ఐశ్వ‌ర్య‌రాయ్ త‌న కూతురితో పారిస్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అక్క‌డ డిస్నీలాండ్‌ని సంద‌ర్శించిన త‌ల్లి కూతుళ్లు ఓ అంద‌మైన ఫోటోకి ఫోజులిచ్చారు. ఒక‌రినొక‌రు ప్రేమ‌గా ముద్దుపెట్టుకుంటూ ఫోటో దిగారు. ఈ ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఐష్‌. ఫ‌న్నేఖాన్ చిత్రంతో బిజీగా ఉన్నఐశ్వ‌ర్య‌రాయ్ లాంజీన్స్ అనే వాచ్ బ్రాండ్‌ని ప్ర‌మోట్ చేసే క్రమంలో షూటింగ్ కోసం ఫ్రాన్స్ వెళ్లింది. ఆరేళ్ళ కూతురిని కూడా త‌న‌తో తీసుకెళ్లిన అందాల సుంద‌రి, గుడ్ టైంని హ్యాపీగా గడుపుతుంది. కూతురికి సంబంధించిన ఫోటోల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ ఫ్యాన్స్‌కి మాంచి మ‌జా అందిస్తుంది.

😍My Angel Forever😘💖✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

2048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS