మాట్లాడుకోడాలు లేవు.. 'అ!' టీజర్ అదిరిందంతే..!

Thu,January 4, 2018 05:30 PM
awe teaser cama now

నటుడిగా కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేసిన నాని తొలిసారి వాల్ పోస్టర్ అనే బేనర్ పై అ! అనే ప్రయోగాత్మక చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాత్ర లుక్స్ విడుదల చేస్తూ వచ్చాడు నాని.

ఈ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా చిత్ర టీజర్ ని విడుదల చేసారు. చేప పాత్రకి నాని వాయిస్ అందించగా, చెట్టు పాత్రకి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. టీజర్ లో అన్ని పాత్రలని కవర్ చేస్తూ చాలా ఇంప్రెసివ్ గా కట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న అ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుండగా, ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు.

3554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles