టాప్ స్టార్స్‌తో అ! సీక్వెల్ ?

Sat,August 17, 2019 11:28 AM
Awe sequel to feature Vijay Sethupathi , Kajal Aggarwal

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం అ! గ‌త ఏడాది విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది. నాని తొలిసారి నిర్మించిన ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించి అల‌రించారు. ఈ చిత్రం ఇటీవ‌ల రెండు జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, అందాల భామ కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప‌లు క‌థ‌ల‌తో మొద‌టి పార్ట్ తెర‌కెక్క‌గా, రెండో పార్ట్ మొత్తం ఒక్క‌టే క‌థ‌తో రూపొంద‌నుంద‌ట‌. ఆ క‌థ ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేదిగా ఉంటుంద‌ని అంటున్నారు. సీక్వెల్ విష‌యం గురించి ప్ర‌శాంత్ ఇటీవ‌ల ఓ ఇంగ్లీష్ ప‌త్రిక‌తో మాట్లాడారు. త‌ప్ప‌క అ! చిత్రానికి సీక్వెల్ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి ఇందులో విజ‌య్ సేతుప‌తి , కాజ‌ల్ న‌టిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

1150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles