అన్ని సినిమాల‌యందు నాని చిత్రం 'అ!' వేర‌యా !

Tue,January 30, 2018 10:04 AM
awe movie release date fixed

న‌టుడిగా రాణిస్తున్న నాని వాల్ పోస్టర్ అనే బేనర్ పై తొలి సారిగా అ అనే ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రం నిర్మిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అయింది. అన్ని సినిమాల‌యందు అ! సినిమా వేర‌యా ! .. విశ్వ‌దాభిరామా ఫిబ్ర‌వ‌రి 16న రిలీజ్ రా మామా! అంటూ మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. ఆ మ‌ధ్య సినిమాకి సంబంధించి ఒక్కో పాత్ర లుక్స్ విడుదల చేస్తూ మూవీపై భారీ అంచ‌నాలు పెంచిన నాని టీజ‌ర్‌తోను ఆక‌ట్టుకున్నాడు. ఇక జనవరి 31న జరిగే ‘అ!’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ట్వీట్ చేశారు నాని. అ! చిత్రంలో చేప పాత్ర‌కి నాని వాయిస్ ఓవ‌ర్ ఇస్తుండ‌గా, చెట్టు పాత్రకి ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు . విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న అ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా పనిచేసాడు.1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles