ఇంట్లో ర‌చ్చ చేసిన కంటెస్టెంట్స్‌.. అవార్డుల‌తో స‌త్కారం

Sun,September 30, 2018 07:47 AM
Award Ceremony in the bigg boss House

జూన్ 10న ప్రారంభ‌మైన బిగ్ బాస్ సీజ‌న్ 2 నేటితో ముగియ‌నుంది. సాయంత్రం 6గం.ల‌కు ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ ప్ర‌సారం కానుండ‌గా ఎవరు విజేత‌గా నిలుస్తారో అనేది అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఫైన‌లిస్ట్‌లుగా దీప్తి, కౌశ‌ల్‌, త‌నీష్‌, గీతా మాధురి, సామ్రాట్‌లు ఉండ‌గా వీరిలో ఒకరు టైటిల్‌ని అందుకోనున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క్ర‌మంలో ఇంటి నుండి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చి ఫైన‌లిస్ట్‌ల‌తో క‌లిసి హంగామా చేశారు. ఫ్యామిలీ పార్టీలా జ‌రిగిన సంద‌డి ప్రేక్ష‌కుల‌కి మంచి ఆనందాన్ని అందించింది.

17 మంది కలిసి బిగ్ బాస్ హౌజ్‌కి కొత్త క‌ళని తీసుకురాగా , ఫ్యామిలీ పార్టీని మరింత రక్తికట్టించేందుకు ‘యాపీ ఫిజ్ అవార్డ్ షో పార్టీ’ అనే ఎనర్జిటిక్ షోను ఏర్పాటు చేశారు బిగ్ బాస్. ఈ షోకి రోల్ రైడా, అమిత్‌లను హోస్ట్‌లుగా నియమిస్తూ... మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కలర్ ఫుల్ డ్రెస్‌లు అందించి పార్టీ వాతావరణం కనిపించే విధంగా హౌస్‌ను అలకరించారు. పార్టీలో భాగంగా తొలుత గీతా మాధురి త‌న గానంతో హౌజ్‌ని షేర్ చేసింది. హిట్ సాంగ్స్ తో 15 నిమిషాల పాటు కంటెస్టెంట్స్‌ని ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించేసింది. ఆమె పాట‌కి హౌజ్‌మేట్స్ రెచ్చిపోయి మ‌రి స్టెప్పులేశారు.

ఆ త‌ర్వాత ర్యాపిడ్‌ క్వ‌శ్చ‌న్స్ రౌండ్ ఒక‌టి నిర్వ‌హించ‌గా యాంక‌ర్స్ గా ఉన్న అమిత్‌, రోల్‌లు మిగిలిన ఇంటి స‌భ్యుల‌ని వెరైటీ క్వ‌శ్చ‌న్స్ అడిగారు. దానికి వారి నుండి ఇంట్రస్టింగ్ ఆన్స‌ర్స్ వ‌చ్చాయి. ఇక ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యులు అంద‌రికి ‘యాపీ ఫిజ్ అవార్డ్ షో పార్టీ’ లో భాగంగా ప‌లు అవార్డ్‌ల‌ని అందించారు. గ‌త సీజ‌న్‌లో ఎన్టీఆర్ వీటిని ఎనౌన్స్ చేయ‌గా, ఈ సారి ఆ బాధ్య‌త‌లని యాంకర్స్‌గా ఉన్న రోల్ రైడా, త‌నీష్ తీసుకున్నారు. ఎవ‌రికి ఏ అవార్డ్ ద‌క్కింద‌నేది క్రింద గ‌మ‌నించ‌వ‌చ్చు.

అయోమయం.. కిరీటి దామరాజు
పక్కా మాస్.. శ్యామల
ఆశా కిరణం.. పూజా రామచంద్రన్
గాన కోకిల.. గీతా మాధురి
మిర్చి.. భాను శ్రీ
మిస్టర్ రోమియో.. సామ్రాట్
ఎంటర్టైనర్.. తేజ‌స్వీ
కాకరకాయ.. దీప్తి
నిద్రబోతు.. దీప్తి సునైనా
ప్రవచన బాబా.. కౌశల్
ఫిజ్ క్లాసీ.. సామ్రాట్
సర్వ జ్ఞాని.. బాబు గోగినేని
తిండిబోతు.. గణేష్
మిస్ బద్దకం.. దీప్తి సునైనా
ఆవేశం.. తనీష్
లౌడ్ స్పీకర్.. సంజనా అన్నే
డ్రామా క్వీన్ .. దీప్తి
దివా ఆఫ్ ది హౌజ్‌.. నందిని రాయ్
ప‌ని దొంగ‌..రోల్ రైడా
ఫూటేజ్ కింగ్‌..అమిత్ తివారీ

అవార్డులు అందుకున్న త‌ర్వాత బిగ్ బాస్ ప్లే చేసిన సాంగ్స్‌కి ఇంటి స‌భ్యులు అంద‌రు త‌మ‌దైన స్టెప్పులు వేసి అల‌రించారు. ఆ త‌ర్వాత ఐదుగురు ఫైన‌లిస్ట్‌ల‌ని అందంగా మార్చేందుకు ఇంట్లోకి మిర్ర‌ర్స్ నుండి ఒక టీం వ‌చ్చింది. ఇంటి స‌భ్యుల‌కి చిన్న గిఫ్ట్ అందించిన త‌ర్వాత ఐదుగురి మేకోవ‌ర్ పూర్తిగా మార్చేశారు. దీంతో 112వ ఎపిసోడ్‌కి పులిస్టాప్ ప‌డింది. నేడు ప్ర‌సారం కానున్న 113వ ఎపిసోడ్‌లో పాత హౌజ్‌మేట్స్‌, ఫైన‌లిస్ట్‌లు , హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాని బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి వంద రోజుల‌కి పైగా సాగిన ఈ జ‌ర్నీలో విజేత ఎవ‌ర‌నేది కొద్ది గంట‌ల‌లో తెలియ‌నుంది. వెయిట్ అండ్ సీ..

4683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles