'అ' సినిమాలో అవ‌స‌రాల లుక్ ఇదే

Thu,December 7, 2017 11:06 AM
avsarala srinivas look released

న‌టుడిగా రాణిస్తున్న నాని ఇటీవ‌ల వాల్ పోస్ట‌ర్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ స్థాపించి ఈ బేన‌ర్‌పై నిర్మాతగా అనే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియ‌ద‌ర్శిని లీడ్ పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని, ర‌వితేజ వాయిస్ ఇవ్వ‌డం విశేషం. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవ‌లే నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశాడు. ఆ త‌ర్వాత‌ వాల్ పోస్ట‌ర్ నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్‌లో నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి ఆడియ‌న్స్‌కి అదిరిపోయే ట్రీట్ అందించింది. ఇక రీసెంట్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ లుక్ కూడా రిలీజ్ చేసింది. పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే అవ‌స‌రాల ఈ చిత్రంలో సైంటిస్ట్‌గా క‌నిపిస్తాడ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఛాయాగ్రాహ‌కుడిగా ప‌నిచేస్తున్నాడు.


1652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS