మెగా హీరో స‌ర‌స‌న అవికా గోర్..!

Thu,May 2, 2019 11:51 AM

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, క్రేజీ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఇప్ప‌టికీ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌, ప్రాజెక్టుకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చిత్రంలో క‌థానాయిక‌గా అవికా గోర్‌ని ఎంపిక చేసిన‌ట్టు తాజా స‌మాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు.


ఎక్క‌డికి పోతావే చిన్న‌వాడా చిత్రంతో తెలుగులో మంచి హిట్ కొట్టిన అవికా గోర్ కొన్నాళ్ళుగా సైలెంట్ అయింది. మారుతి చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించ‌నుంద‌ని అంటున్నారు. దిల్ రాజు, రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలోను అవికానే క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఈ రెండు చిత్రాల‌లో ఒక్క చిత్రం హిట్ అయిన ఈ అమ్మ‌డికి తెలుగులో మంచి ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం. కాగా, మారుతి చివ‌రిగా శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం చిత్ర‌ల‌హ‌రి మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

2101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles