అవెంజ‌ర్స్ :ఎండ్ గేమ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Fri,March 15, 2019 11:51 AM
Avengers Endgame official trailer released

2012లో నిర్మించబడిన అమెరికన్ సినిమా అవెంజర్స్ . ఇది ఆరుగురు సూపర్ హీరోల‌ సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. ఆ హీరోలు పేర్లు ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా, మరియు ఏజెంట్ బార్టన్. అవెంజ‌ర్స్ సిరీస్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ అద్బుత విజ‌యం సాధించాయి. చివ‌రిగా ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ అనే పేరుతో చిత్రం విడుద‌లైంది. ఇందులో ప‌లు సందేహాల‌ని మిగిల్చిన మేక‌ర్స్ అవెంజ‌ర్స్ 4లో తీర్చ‌నున్నారు. అయితే తాజాగా అవెంజ‌ర్స్ : ఎండ్ గేమ్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఐరన్ మ్యాన్ వాయిస్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్‌లో ప‌లువురు అవెంజ‌ర్స్ క‌నిపించ‌గా వారంద‌రు కొత్త డ్రెస్‌ల‌లో థానోస్‌పై యుద్దానికి బ‌య‌లుదేర‌తారు. ఆ సన్నివేశాలు అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఆంటోని రుస్సో, జాయ్ రుస్సో ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles