తెలుగు రాష్ట్రాల‌లో భారీ స్థాయిలో విడుద‌ల కానున్న‌ హాలీవుడ్ చిత్రం

Mon,April 22, 2019 09:43 AM
avengers endgame huge release in telugu states

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అమెరిక‌న్ సినిమా ‘అవెంజర్స్ ఎండ్ గేమ్‌’. ఏప్రిల్ 26న విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. హాలీవుడ్‌లో రూపొందించిన ఓ చిత్రాన్ని తెలుగు డబ్ చేసి ఇంతటి భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ఇదే తొలిసారి. ఆంటోని రుస్సో, జాయ్ రుస్సో ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డౌనీ జూనియర్ నటిస్తున్న ఈ చిత్రంలో క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్ వర్త్, స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్స్ నటించారు.

2012లో నిర్మించబడిన అమెరికన్ సినిమా అవెంజర్స్ . ఇది ఆరుగురు సూపర్ హీరోల‌ సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. ఆ హీరోలు పేర్లు ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా, మరియు ఏజెంట్ బార్టన్. అవెంజ‌ర్స్ సిరీస్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ అద్బుత విజ‌యం సాధించాయి. చివ‌రిగా ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ అనే పేరుతో చిత్రం విడుద‌లైంది. ఇందులో ప‌లు సందేహాల‌ని మిగిల్చిన మేక‌ర్స్ అవెంజ‌ర్స్ : ఎండ్ గేమ్‌లో తీర్చ‌నున్నారు. థానోస్‌ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్‌ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ చిత్ర‌ కథ. థానోస్‌ పాత్రకి రానా తెలుగులో డబ్బింగ్ చెప్పిన విష‌యం విదిత‌మే . 'ది అవెంజర్స్-ఎండ్ గేమ్' కోసం డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏ.ఆర్.రెహమాన్ స్పెష‌ల్‌గా ఓ పాట కూడా రూపొందించగా, ఇది విశేష ఆద‌ర‌ణ పొందింది.

3182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles