అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌.. రెహ్మాన్‌ పాడిన తెలుగు పాట వచ్చేసింది..

Wed,April 10, 2019 12:18 PM
Avengers Endgame anthem song released in Telugu by music director AR Rahman

హైదరాబాద్‌: అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ సినిమా కోసం సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ కొన్ని బాణీలను సమకూర్చాడు. గతంలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న రెహ్మాన్‌.. ఈ హాలీవుడ్‌ ఫిల్మ్‌ కోసం ప్రత్యేకంగా పనిచేశారు. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలోనే రిలీజ్‌ కానున్నది. అయితే అభిమానలకు స్పూర్తినిచ్చే ఓ పాటను ఈ సినిమా కోసం రెహ్మాన్‌ పాడారు. ఆ సాంగ్‌ను కేవలం ఇండియా ప్రేక్షకుల కోసమే రూపొందించారు. అయితే ఆ పాటను మొదట తెలుగులో రిలీజ్‌ చేశారు. అంతులేని అంతరిక్షమే దాటి అంటూ.. రెహ్మాన్‌ స్వయంగా ఆ పాటను పాడారు. మార్వెల్‌ గేయంగా ఈ పాటను తీర్చిదిద్దారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఈ సినిమా రిలీజ్‌కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇదే ఆ సాంగ్‌ వీడియో.
1321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles