ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నుండి 'అవ‌సరం' వీడియో సాంగ్ విడుద‌ల‌

Thu,March 7, 2019 09:47 AM
Avasaram Video Song released

ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో సంచ‌లన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ సిద్ధిపేట‌లో జ‌ర‌గుతున్న‌ట్టు తెలుస్తుంది. మార్చి 22న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఓ వైపు జ‌రుగుతుంటే మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు, ప్ర‌మోష‌న్స్ చాలా స్పీడ్‌గా సాగుతున్నాయి. తాజాగా చిత్రం నుండి అవ‌స‌రం అంటూ సాగే పాట వీడియో విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్ మాలిక్ సంగీతంలో రూపొందిన ఈ పాట‌కి సిరా శ్రీ లిరిక్స్ రాశారు. విల్స‌న్ హ‌రెల్డ్ ఆల‌పించారు. ఈ సింగ‌ర్ వాయిస్ కాస్త ఘంట‌సాల వాయిస్‌లా అనిపిస్తుండ‌డంతో వ‌ర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాట‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ..ఈ పాట‌ని ఘంట‌సాల ఆల‌పించ‌లేదు అని ఫ‌న్నీగా కామెంట్ పెట్టారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రాలు అంత‌గా స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. ఈ చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.

2881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles