విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా కోసం ఆడిష‌న్స్‌

Thu,June 14, 2018 08:14 AM
auditions for dear comrade

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో అలరించిన విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు చిత్రంతో అందరి దృష్టిలో పడ్డాడు.అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక అప్పటి నుండి విజయ్ దేవరకొండకి పెద్ద బేనర్స్‌ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో గీతా గోవిందం సినిమా చేస్తున్నాడు విజయ్. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డియ‌ర్ కామ్రేడ్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. చిత్రంలో కొత్త అమ్మాయిని క‌థానాయికగా తీసుకోనున్నారు.

ఈ నెల 16,17 తేదీల‌లో కాకినాడ‌లోని గాంధీ భ‌వ‌న్‌లో ఉద‌యం 9గం.ల నుండి సాయంత్రం 6గం.ల వ‌ర‌కి ఆడిష‌న్స్ నిర్వ‌హించ‌నున్నారు చిత్ర నిర్మాత‌లు. ఈస్ట్‌, వెస్ట్ గోదావ‌రి జిల్లాల‌కి సంబంధించిన టాలెంట్ వ్య‌క్తుల‌ని మాత్ర‌మే డియ‌ర్ కామ్రేడ్ చిత్రం కోసం ఎంపిక చేయ‌నున్నట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఆస‌క్తిగ‌ల వారు ఈ రెండు రోజుల‌లో జరిగే ఆడిష‌న్స్‌లో పాల్గొని మూవీలో మంచి క్యారెక్ట‌ర్ పొంద‌వ‌చ్చు అని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం నోటా అనే బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట విజయ్. ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా విడుద‌ల కావ‌ల‌సి ఉంది.

2812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS