వేలం ప‌ద్ధ‌తిలో 2.ఓ హ‌క్కుల అమ్మ‌కం !

Sun,October 21, 2018 12:07 PM
auction for 2.0 rights

దేశ‌ వ్యాప్తంగా ఉన్న‌ సినీ ప్రేమికులు కొన్నేళ్ళుగా ఓ చిత్రం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఆ చిత్రం మ‌రేదో కాదు. విజువ‌ల్ వండ‌ర్‌లా తెర‌కెక్కిన 2.ఓ. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్స‌న్‌, అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగవంతం చేశారు. రీసెంట్‌గా రెండు లిరిక‌ల్ వీడియోలు విడుద‌ల చేయ‌గా వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే చిత్ర రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి పోటీ ఎక్కువైపోయింది. ఒక్కో ప్రాంతం నుంచి సుమారు 10 మంది బయ్యర్లు సినిమాను కొనడానికి ముందుకొస్తున్నారట. అందుకే ‘2.O’ థియేట్రికల్ హక్కుల అమ్మకాన్ని వేలం పద్ధతిలో నిర్వహించాలని లైకా ప్రొడక్షన్స్ నిర్ణయించిందని సమాచారం. ప్రతి ప్రాంతానికి వేలం పెట్టి అత్యధిక ధరకు పాడుకున్న బయ్యర్లకు హక్కులను అందజేస్తారని టాక్. 2.ఓ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లోనే కాక వేరే భాష‌ల‌లోను చిత్రాన్ని అనువ‌దించి రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ స్పంద‌న లభించ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు చెరిపేయ‌డం ఖాయం అంటున్నారు.

2017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles