రెండు ప్రాజెక్టులని ఓకే చేసిన షారూఖ్‌..!

Fri,April 12, 2019 08:11 AM
Atlee next project with Shah Rukh Khan go viral

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కి ఇటీవ‌ల కాలంలో విజ‌యం అంద‌ని ద్రాక్ష‌లా మారింది. ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం జీరోపై భారీ హోప్సే పెట్టుకున్న నిరాశే ఎదురైంది. ఈ సారి మాంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్న షారూఖ్ త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మెర్స‌ల్ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంటున్నారు. క‌ట్ చేస్తే త‌మిళంలో మంచి చిత్రాలు తెర‌కెక్కించిన అట్లీ ద‌ర్శ‌క‌త్వంలోను షారూఖ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఐపీఎల్‌ సీజన్‌12లో భాగంగా చెన్నై- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి కనిపించ‌డంతో షారూఖ్ సినిమాతో అట్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. షారూఖ్‌కి అట్లీ రెండు స్క్రిప్టులు వినిపించ‌గా, ఆయ‌న ఒక‌టి ఓకే చేశాడ‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. అట్లీ ప్ర‌స్తుతం విజ‌య్ 63వ సినిమాతో బిజీగా ఉన్నాడు. విజ‌య్‌- అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై కూడా భారీ హోప్స్ ఉన్నాయి .

1079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles