ఇండియ‌న్ సాంగ్ పాడినందుకు పాక్ సింగ‌ర్‌పై ట్రోలింగ్‌

Fri,August 10, 2018 12:05 PM
Atif Aslam Gets Flak for Singing Indian Song at Pak Independence Day Parade

బాలీవుడ్‌లో ప‌లు హిందీ చిత్రాల‌కి పాట‌లు పాడిన పాక్ సింగ‌ర్ అతీఫ్ అస్లాం న్యూయార్క్‌లో జ‌రిగిన పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే ఫంక్ష‌న్‌లో ఇండియ‌న్ సాంగ్ పాడారు. ఈ సంఘ‌ట‌న ఆగ‌స్ట్ మొద‌టి వారంలో జ‌ర‌గ‌గా దీనిపై పాకిస్థానీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పాక్ ఇండిపెండెన్స్ ఫంక్ష‌న్‌లో ఇండియ‌న్ సాంగ్ పాడ‌టమేంటి, డ‌బ్బుల కోసం జాతి గౌర‌వాన్ని కించ‌ప‌ర‌చ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అని అతీఫ్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఈ విష‌యంలో సింగ‌ర్‌కి కొంత మంది స‌పోర్ట్ ఇస్తున్నారు. సంగీతానికి, పాట‌ల‌కి మతం, ప్రాంతం అనే భేదాలు ఉండ‌వు. పాకిస్థానీలు భారతీయ చలన చిత్రాలను చూడలేదా? మన ఛానళ్లలో భారతీయ నాటకాలు సాధారణమైనవి కాదా అని ప్రశ్నించారు. అయితే ఈ వివాదంపై అతీఫ్ కూడా స్పందించారు. ఇలాంటి న‌కిలీ ప్ర‌చారాలు చేసే వారిని అల్లా కాపాడాల‌ని కోరుకుంటున్నాను. త‌ప్పుడు ప్ర‌చారాలు చేసే వారి మ‌న‌సులు మారి కొత్త పాకిస్థాన్ ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నాను అని అన్నారు.1922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles