వాల్మీకి చిత్ర బృందానికి కృత‌జ్ఞ‌తలు తెలిపిన త‌మిళ హీరో

Thu,September 5, 2019 01:51 PM
atharvaa shooting part completed

త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెలుగులో తెర‌కెక్కుతున్న చిత్రం వాల్మీకి. సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్‌, అధర్వ ముర‌ళి, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తైంద‌ని చెబుతూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, సినిమాటోగ్రాఫ‌ర్,నిర్మాత‌లు, హీరో వ‌రుణ్ తేజ్‌తో పాటు చిత్ర బృందంతో అద్భుత క్ష‌ణాలు గ‌డిపాను అని అధ‌ర్వ తెలిపాడు. అధ‌ర్వ ట్వీట్‌కి స్పందించిన హ‌రీష్ శంక‌ర్ .. ఈ పాత్రను అంగీకరించినందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు స‌రిపోవు స‌ర్‌.. మీ వైఖరి, నటన మా కెంతో న‌చ్చాయి అని అన్నాడు. స్క్రీన్‌పై మీ ప‌ర్‌ఫార్మెన్స్ చూసేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం అని రామ్ ఆచంట ట్వీట్‌లో తెలిపారు. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



1353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles