అత్తారింటికి దారేది చిత్ర రీమేక్ విడుద‌ల‌కి టైం ఫిక్స్

Tue,January 22, 2019 09:49 AM
Atharintiki Daaredi remake to be released soon

పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ . ఈ సినిమా పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తుండ‌గా, సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. రీమేక్ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌లో శింబు న‌టిస్తుండ‌గా, ఆయ‌నకి జోడీగా మేఘా ఆకాశ్ న‌టిస్తుంది. మ‌రో క‌థానాయిక‌గా కేథరిస్ థెరిస్సా న‌టించింది. ‘వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్’ అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 1న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రీమేక్ చిత్రం తెలుగులో మాదిరిగా త‌మిళంలోను భారీ విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తుంది. హిప్‌ హాప్‌ తమీజా చిత్రానికి సంగీతాన్నిఅందించారు. ఈ చిత్ర విడుద‌ల త‌ర్వాత శింబు దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించేందుకు సిద్ధ‌మ‌య్యాడు .

1841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles