జార్జియాలో అత్తారింటికి దారేది రీమేక్ షూటింగ్‌

Sat,September 22, 2018 09:31 AM
Atharintiki Daaredi remake in jeorgia

పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ . ఈ సినిమా పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఇపుడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమిళంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ రీమేక్ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌లో శింబు న‌టిస్తుండ‌గా, ఆయ‌నకి జోడీగా మేఘా ఆకాశ్ న‌టిస్తుంది. నితిన్ న‌టించిన లై, ఛ‌ల్ మోహ‌న రంగా చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టించిన ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. రీమేక్ చిత్రంలో స‌మంత పాత్ర‌ని మేఘా ఆకాశ్ చేస్తుంద‌ని తెలుస్తుండగా, ప్ర‌ణీత పాత్ర‌ని ఐశ్వ‌ర్య లేక్ష్మీ చేస్తుంది. ఈ చిత్రంతో త‌మిళ డెబ్యూ ఇస్తుంది ఐశ్వ‌ర్య‌. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇంట్ర‌డ‌క్షన్ సాంగ్‌ని ఇప్ప‌టికే పూర్తి చేసిన యూనిట్ కీల‌క సన్నివేశాలు తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మైంద‌ట‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ ప్లాన్ చేస్తుంది. ప‌వ‌న్ పాత్ర పోషిస్తున్న శింబు రీసెంట్‌గా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ‘సెక్క సివంద వానం’ (తెలుగులో నవాబ్‌) అనే చిత్రం పూర్తి చేశాడు. దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించేందుకు సిద్ధ‌మ‌య్యాడు ఈ కుర్ర హీరో.

2229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS