‘అశ్వథ్థామ‌’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. జ‌న‌వ‌రిలో రిలీజ్‌కి ప్లాన్

Wed,December 11, 2019 12:34 PM

ఇటీవ‌ల ఛ‌లో చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న హీరో నాగ‌శౌర్య .ఈ మూవీ త‌ర్వాత క‌ణం, అమ్మ‌మ్మ‌గారిల్లు, న‌ర్త‌న‌శాల చిత్రాలు చేసిన నాగ శౌర్య ఈ చిత్రాల‌తో వ‌రుస‌ ఫ్లాపులు మూట‌గ‌ట్టుకున్నాడు. రీసెంట్‌గా ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికి ఆ క్రెడిట్స్ అన్నీ స‌మంత‌కే ద‌క్కాయి. ప్ర‌స్తుతం త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వథ్థామ‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశారు.నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో నాగ శౌర్య చాలా ఆవేశంగా క‌నిపిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 31న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేకర్స్ పేర్కొన్నారు. మ‌రోవైపు నాగ శౌర్య లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 8గా వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. మూగ‌మ‌న‌సులు అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్నారు.

1615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles