మ‌హేష్ మేన‌ల్లుడి డెబ్యూ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి

Sun,November 17, 2019 07:34 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీ న‌వంబ‌ర్ 10న ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. దేవ‌దాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న న‌టిస్తుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తైంది. ఈ సంద‌ర్భంగా గ‌ల్లా జ‌య‌దేవ్ సెట్స్‌కి వెళ్లి టీం అంద‌రితో స‌ర‌దాగా గడిపారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

1613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles