సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ నుండి మ‌రో హీరో

Thu,October 18, 2018 10:25 AM
ashok debut movie started

టాలీవుడ్‌లో వార‌సుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఎంద‌రో వార‌సులు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. తాజాగా అశోక్ డెబ్యూ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి సూప‌ర్ స్టార్ కృష్ణ‌,రాఘ‌వేంద్ర‌రావు, మంజుల, దిల్ రాజు తదితరులు హాజ‌ర‌య్యారు. శ‌శి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. న‌భా న‌టాషా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అదే నువ్వు అదే నేను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్రానికి తొలిక్లాప్ కృష్ణ కొట్టారు. అతి త్వ‌ర‌లోనే మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

అశోక్ కొన్నాళ్ళుగా అమెరికాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో న‌ట‌న‌కి సంబంధించిన శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. అశోక్ చిత్రం శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న‌ట్టు స‌మాచారం. సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ వెండితెర‌పై మ‌రో సూప‌ర్ స్టార్‌గా ఎదిగారు మ‌హేష్ బాబు. ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ కూడా 1 నేనొక్క‌డినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక మ‌హేష్ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు, మంజుల‌, ఆమె కూతురు జాన్వీ కూడా వెండితెర‌పై మెరిసారు. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.1784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles