అసలేం జరిగింది? చిత్ర పోస్టర్‌ను విడుదల చేసిన ఎంపీ సంతోష్ కుమార్

Sat,January 12, 2019 05:35 PM

ఎక్సోడస్ మీడియా సంస్థ నిర్మిస్తున్న 'అసలేం జరిగింది?' సినిమా పోస్టర్‌ను ఎంపీ సంతోష్ కుమార్ శనివారం ఆవిష్కరించారు. నీలిమా నిర్మాతగా, శ్రీరాం హీరోగా రూపొందుతున్న చిత్రం ఘన విజయం సాధించాలని సంతోష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని కొత్త ప్రదేశాల్లో షూటింగ్ జరపాలనుకోవడం అభినందనీయమన్నారు. దీనికోసం చిత్ర యూనిట్ గత 6 నెలల నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం గొప్ప విషయమన్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న కెమెరామెన్ ఎన్‌వీఆర్‌కు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు.


శ్రీరాం హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి మహావీర్ సంగీతం అందిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన 'భైరవగీత' సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ రామ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. చిత్రానికి కథను నెర్రపల్లి వాసు అందించారు. ఫిబ్రవరి 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని.. రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత కె.నీలిమా పేర్కొన్నారు.

4140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles