షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన తమిళ మన్మధుడు

Mon,April 24, 2017 02:39 PM

ఒకప్పుడు హీరోగా అలరించిన తమిళ మన్మధుడు అరవింద్ స్వామి , ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. సతురంగ వెట్టై 2, వనంగముడి, భాస్కర్ ఒరు రాస్కెల్ మరియు నరగసూరన్ అనే చిత్రాలలో అరవింద్ స్వామి నటిస్తుండగా, ఈ ప్రాజెక్టులు వేరియస్ స్టేజెస్ లో ఉన్నాయి. అయితే అరవింద్ స్వామి తాజాగా తన ట్విట్టర్ లో సినిమా సంగతులను షేర్ చేసుకున్నాడు. మలయాళ మూవీ భాస్కర్ ది రాస్కెల్ కి రీమేక్ గా భాస్కర్ ఒరు చిత్రం తెరకెక్కుతుండగా ఈ చిత్రం కొచ్చిలో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుందని అన్నాడు. ఇందులో అరవింద్ స్వామి సరసన అమలా పాల్ కథానాయికగా నటిస్తుంది. మీనా కూతురు నైనిక ముఖ్య పాత్రలో కనిపించనుంది. సిద్ధిఖీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదల కాగా, ఇందులో అరవింద్ స్వామి లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అరవింద్ స్వామి మరో చిత్రం వనంగముడి సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుండగా తాను టీం జాయిన్ కానున్న విషయాన్ని తెలిపాడు



941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles