పంచెకట్టులో పవర్ ఫుల్ గా ..

Tue,April 11, 2017 01:56 PM
Arvind Swamy powerful look

కోలీవుడ్ గ్లామర్ హీరో అరవింద్ స్వామి ఈ మధ్య కాస్త రూట్ మార్చాడు. కేవలం హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్ టైనర్ అందిస్తున్నాడు. ఆ మధ్య తెలుగులో ధృవ అనే సినిమాలో విలన్ గా కనిపించి వావ్ అనిపించాడు. ఇక ఇప్పుడు మలయాళ మూవీ రీమేక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మమ్ముట్టి, నయనతార జంటగా ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాధించిన చిత్రం భాస్కర్ ది రాస్కెల్. బాడీగార్డ్ ఫేం సిద్ధిఖీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అరవింద్ స్వామి రీమేక్ చేస్తున్నాడు. భాస్కర్ ఒరు రాస్కెల్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుండగా ఇందులో అమలా పాల్ కథానాయికగా నటిస్తుంది. మీనా కూతురు నైనిక ముఖ్య పాత్రలో కనిపించనుంది. సిద్ధిఖీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ఇందులో అరవింద్ స్వామి లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని ఇస్తుంది. భాస్కర్ ది రాస్కెల్ చిత్రాన్ని తెలుగులోను వెంకీ రీమేక్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే.

1750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles