అరవింద్ స్వామి 'న‌వాబ్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tue,August 14, 2018 09:35 AM
Arvind Swami  first look revealed

మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తెర‌కెక్కించే మ‌ణిర‌త్నం తాజాగా త‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌వాబ్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ మ‌ల్టీ స్టార‌ర్ గా రూపొందుతుంది. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్‌, లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది .

పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలోని హీరోలంతా అన్నదమ్ములుగా కనిపించనున్నారు. రాజకీయనాయకుడిగా అరవింద్ స్వామి .. ఇంజనీర్ గా శింబు .. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారట. ఈ పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. తాజాగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ లుక్ లో అభిమానుల‌ని క‌ట్టిప‌డేస్తున్నాడు కోలీవుడ్ మ‌న్మ‌ధుడు. వ‌ర‌ద అనే పాత్ర‌లో అర‌వింద్ స్వామి అల‌రించ‌నున్నాడు. ఈ నెలలో టీజర్ ను .. వచ్చే నెల ఆరంభంలో ట్రైలర్ ను విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుంద‌ట‌. చెలియా త‌ర్వాత మ‌ణిర‌త్నం చేస్తున్న ఈ మూవీపై త‌మిళంలోనే కాదు తెలుగులోను భారీ అంచ‌నాలు ఉన్నాయి.

1573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles