విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మైన హీరో

Sun,May 12, 2019 08:10 AM
Arunoday Singh announces separation from wife Lee Elton

సినిమా ఇండ‌స్ట్రీలోని న‌టీన‌టులు ఎప్పుడు ప్రేమించుకుంటారో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో కూడా బ‌య‌టికి తెలీదు. అయితే పెళ్ళి త‌ర్వాత కొన్నాళ్ళు సంసారం సాగిన త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ఏ చిన్న‌పాటి విబేధాలు వ‌చ్చిన విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతుంటారు. తాజాగా జిస్మ్ 2 చిత్రంతో ప్రేక్ష‌కులకి ప‌రిచ‌య‌యైన అరుణోద‌య్ సింగ్ త‌న భార్య లీ ఎల్ట‌న్‌తో విడాకులు తీసుకోబోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రేమించుకున్న‌ప్పుడు సంతోషంగా ఉన్న తాము, ఇప్పుడు అలా ఉండ‌లేక‌పోతున్నామ‌ని, కౌన్సిలింగ్ ద్వారా వివాహ బంధాన్ని నిలుపుకునే ప్ర‌య‌త్నం చేసిన అవి వర్కవుట్ కావ‌డం లేద‌ని అరుణోద‌య్ అన్నారు. ఈ క్ర‌మంలో విడిపోవ‌డ‌మే బెట‌ర్ అని భావించిన ఇద్ద‌రం విడాకులు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. 2016 డిసెంబ‌ర్‌లో భోపాల్ వేదిక‌గా వీరిద్ద‌రు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. అరుణోద‌య్ సింగ్ ఐసా, యే సాలీ జిందగీ, మై తెరా హీరో, బుద్దా ఇన్ ఏ ట్రాఫిక్, మొహెంజదారో, బ్లాక్ మెయిల్ వంటి చిత్రాల్లో నటించారు

6023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles