సాహో టీంతో ప్ర‌యాణం అద్భుతంగా సాగింది..

Tue,March 19, 2019 09:46 AM
arun vijay emotional tweet goes viral

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సాహో. స్పై థ్రిల్ల‌ర్‌గా ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన వీడియోలు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా ఇందులోల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా అరుణ్ విజ‌య్ షూటింగ్ పార్ట్ పూర్తైంది. ఈ సంద‌ర్భంగా అరుణ్‌తో కేక్ క‌ట్ చేయించింది చిత్ర బృందం. హార్డ్ వ‌ర్కింగ్ టీంతో క‌లిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్‌, సుజీత్‌, యూవీ క్రియేష‌న్స్‌, మిగ‌తా చిత్ర బృందంతో సాగిన ఈ ప్ర‌యాణం ఓ మంచి జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది. అద్భుత‌మైన అనుభూతి పోంద‌డానికి ఆగ‌స్ట్ 15 వ‌ర‌కు ఆగండి. ఆ రోజు మిమ్మ‌ల్ని అంద‌రిని క‌లుస్తాను అని కామెంట్ పెట్టారు అరుణ్ విజ‌య్. రెండేళ్ళుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంని టీం చెబుతుంది.1517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles