సినీ రంగంలోకి మ‌రో వార‌సురాలు

Tue,February 19, 2019 10:35 AM
Arun Pandians daughter to make her film debut

ఇండ‌స్ట్రీలోకి వార‌సుల ఎంట్రీ కొన‌సాగుతూనే ఉంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌లో స్టార్ హీరో, హీరోయిన్ల వార‌సులు అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ప్ర‌ముఖ త‌మిళ హీరో అరుణ్ పాండ్య‌న్ త‌న‌య కీర్తి పాండ్య‌న్ త్వ‌ర‌లోనే త‌మిళ తెర‌పై మెర‌వ‌నుంది. హ‌రీష్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్శ‌న్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతుండ‌గా ఇందులో క‌థానాయిక‌గా కీర్తి న‌టిస్తుంద‌ట‌. అరుణ్ పాండ్య‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. అనిరుద్‌, వివేక్- మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. 90వ దశకంలో తమిళంలో యాక్షన్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అరుణ్ పాండ్య‌న్, అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.

ఇప్ప‌టికే త‌మిళంలో స్టార్ హీరోల కూతుళ్లు శృతి హాస‌న్‌( క‌మ‌ల్ కూతురు) , వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ (శ‌ర‌త్ కుమార్ కూతురు), ఐశ్వ‌ర్య‌( అర్జున్ కూతురు) ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి కీర్తి పాండ్య‌న్ తొలి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని మెప్పించి రానున్న రోజుల‌లో మంచి ఆఫ‌ర్స్ అందుకుంటుందేమో చూడాలి. కీర్తి గ‌త కొన్నాళ్ళుగా సింగ‌పూర్‌లో ఫిలిం డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలో పని చేస్తుంది. ఈ క్ర‌మంలో ఆమెకి సినిమాపైన ఆస‌క్తి పెరిగింది. దీంతో న‌ట‌న‌, డ్యాన్స్‌లోను శిక్ష‌ణ తీసుకుంది. తాను చేయ‌బోవు తొలి చిత్రం ఫ్యామిలీస్‌, పిల్ల‌ల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని చెబుతుంది. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయింద‌ని చెప్పిన కీర్తి, ఇందులో వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ చాలా ఉంటుంద‌ని పేర్కొంది.

4355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles