వీడెంత పెద్ద స్కాం చేశాడో తెలుసా..?

Tue,November 19, 2019 06:11 PM


నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తోన్న చిత్రం అర్జున్ సురవరం. ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘అర్జున్ ను వెంటనే అరెస్ట్ చేయాలి..వీడెంత పెద్ద స్కాం చేశాడో తెలుసా..? రూపాయి, రెండు రూపాయలు కాదు. 13 కోట్ల రూపాయలు’ అనే సంభాషణలతో షురూ అయ్యే ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతుంది.


నిఖిల్ ఈ చిత్రంలో రిపోర్టర్ గా కనిపించనున్నాడు. టీ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. త‌మిళంలో సూప‌ర్ సక్సెస్ అందుకున్న క‌నిత‌న్‌కి రీమేక్‌గా అర్జున్ సుర‌వ‌రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

2289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles