బాధితుడిలా కాదు, రిపోర్టర్‌లా ఆలోచించాలి- ట్రైల‌ర్

Wed,November 20, 2019 08:35 AM

నిఖిల్ సిద్దార్ధ్‌, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంతోష్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అర్జున్ సుర‌వ‌రం. ముందుగా ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ ఖ‌రారు చేయ‌గా, జ‌గ‌ప‌తి బాబు సినిమా కూడా ఇదే టైటిల్‌తో విడుద‌ల కావ‌డంతో పేరు మార్చి అర్జున్ సుర‌వ‌రం అని పెట్టారు. ప‌లుమార్లు వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు మేక‌ర్స్. ఈ నేప‌థ్యంలో చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రం నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ ప్రధానాంశంగా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో అర్జున్ సురవరంను ఇరుక్కోవ‌డం, జర్నలిస్టు అయిన హీరో ఆ స్కామ్‌ను బయటపెట్టి అసలు నేరస్తులను చట్టానికి పట్టించ‌డం సినిమా ప్ర‌ధానాంశంగా ఉంటుంది. తమిళ సినిమా ‘కనితన్’కు రీమేక్. ప్రేమ, ఎమోషన్, యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ అంశాలు సినిమాలో పుష్క‌లంగా ఉన్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, నాగినీడు, సత్య, కిశోర్, తరుణ్ అరోరా, ప్రగతి, విద్యుల్లేఖ రామన్, డెల్సన్ డిసౌజ, వాట్సన్ ముఖ్య పాత్రలు పోషించారు. బి. మధు సమర్పణలో ఈరోస్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో ఏ మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు.

707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles